నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బాబు సాయి పేటకు చెందిన పులివెందుల గురువమ్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ స్థానిక నాయకులు కరుణించకపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం బిఆర్ఎస్ లో ఉన్నానని వచ్చిన ఇంటిని తీసివేశారని బాధితులు వాపోయారు. ఇల్లు మంజూరు కాగా ఉన్న పూరిగుడిసెను కూలకొట్టమని ,ఈ విషయంపై ఎంత ప్రాధేయపడిన స్థానిక నేతలు కనికరించడం లేదని ఉన్నంత అధికారులు తమకు న్యాయం చేయాలన్నారు.