ఎర్రవల్లి మండల పరిధిలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE పాఠశాల నందు ఎర్రవల్లి శ్రీ సరస్వతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ గద్వాల్ సంస్కార్ స్కూల్ ఎర్రవల్లి శ్రీ సరస్వతి మెయిన్ క్యాంపస్ మరియు శ్రీ సరస్వతి ఏసీ క్యాంపస్ పాఠశాలల ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయ బృందం వారు ఎర్రవల్లిలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE ఏసీ క్యాంపస్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు .కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి అమీర్ షాషా హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.