రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి మెలగాలని విజయవాడ సత్యనారాయణ పురం సిఐ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్లు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు హాజరు కావాలన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం గంజి వంటివి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సౌజన్య సిబ్బంది పాల్గొన్నారు.