తాడిపత్రి పట్టణంలోనీ భగత్ సింగ్ నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి మున్సిపల్, రెవెన్యూ అధికారులు కొలతలు వేస్తున్నారు. ఇన్ఛార్జ్ తహశీల్దార్ సోము, ఇంజినీర్, టౌన్ ప్లానర్ సుజాత ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. AP సర్వే బౌండరీ యాక్ట్ 1923, సెక్షన్ 15(1), 22 ప్రకారం సర్వే చేస్తున్నట్లు తెలిపారు.