ఈనెల 1వ తేదీన కర్నూలులో బంగారు షాపు యాజమాని హిజార్ దారుణ హత్యకు గురైనారు. సాయంత్రం రాధాకృష్ణ టాకీస్ వద్దనున్న ఓ మసీదులో ప్రార్థన చేసుకుని బయటకు వస్తున్న హిజార్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతిదారుణంగా కత్తులతో దాడి చేశారని కర్నూలు వన్ టౌన్ సిఐ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన వివరాలను వెల్లడించారు. హిజార్ అరచేతిని పూర్తిగా తొలగించారు. దీంతో ఆయన కుప్పకూలి పోయాడు. స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో హిజార్ మరణించారు. ఈ కేసు నమోదు చేసుకుని ధర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.