రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతగా పథకాలను అమలు చేస్తోందన్నారు.పోలవరం, అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. పింఛన్ల పంపిణీ నుంచి స్త్రీశక్తి వరకు ప్రతి పథకాన్ని కార్యకర్తలు ప్రజల దరిదాపుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.