శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి భారీగా వరదనీరు విడుదల చేయడంతో గోదావరి పరివాహక గ్రామాల రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. 39 గేట్ల నుండి 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో సోన్ మండలంతో పాటు మాదాపూర్ గ్రామాల్లోని పంట పొలాల్లోకి వరద నీరంతా చేరి వరి, మొక్కజొన్న సోయాబీన్, పసుపు, పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. వందల ఎకరాల్లో ఇసుక మేట వేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు సర్వే చేపట్టి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.