అనంతపురంలో జరిగే సూపర్ 6 - సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కొత్తచెరువు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పూల శివప్రసాద్ బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. మార్కెట్ యార్డు సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారన్నారు.