వామపక్షాల పిలుపుమేరకు గజపతినగరం జయంతి కాలనీ, బంగారంపేట గ్రామాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ అమరవీరుల దీక్ష దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు వీ లక్ష్మి గ్రామస్తుల చేత సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ బారాలపై మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో పలువురు పాల్గొన్నారు.