చంద్రగ్రహణం పురస్కరించుకొని ఉమ్మడి జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం నుండి నుండే మూతపడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని పాగుంట వెంకటేశ్వర స్వామి, మల్దకల్ సీతిమ్మప్ప స్వామి ఆలయం, పట్టణంలోని శ్రీ జములమ్మ అమ్మవారి దేవాలయం, దేవస్థానముల అధికారులు మూసివేశారు. అదే విధంగా అలంపూర్ని దత్తాత్రేయ స్వామి ఆలయం చెన్నకేశవ స్వామి ఆలయం కూడా తాళాలు వేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంత జిల్లాలోని అన్ని ఆలయాలకు తాళాలు వేస్తారు. మళ్లీ సోమవారం ఉదయం ఆలయాలు ఓపెన్ చేయబడతాయని భక్తులందరికీ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు..