పూతలపట్టు మండలం బందర్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ట్రైన్ నుంచి అదుపుతప్పి కిందపడి మృతి చెందినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పూతలపట్టు సీఐ కృష్ణమోహన్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.