అద్దంకిలోని వెలుగు కార్యాలయం నందు బుధవారం జరిగిన ఆడిట్ ను డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడతల వారీగా అన్ని మండలాల్లో వివోఏలకు సంబంధించి ఆడిట్ జరుగుతుందని అన్నారు.మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయ సంఘాల ద్వారా వారు పరిశ్రమలు పెట్టుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. గేదెలు, గొర్రెలు, కోళ్ళు వంటి వ్యాపారం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని శ్రీనివాసరావు తెలియచేశారు. పీఎంజేవై పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వారికి బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు.