అల్లూరి జిల్లా పెదబయలు మండలం రుడకోట ను మండల కేంద్రంగా ప్రకటించాలంటే డిమాండ్ చేస్తూ రోడకోట వారపు సంతలో స్థానిక సర్పంచ్ కతారి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండలం డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం నుండి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోందని అన్ని వసతులు ఉన్న తమ గ్రామాన్ని మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.