శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని జిసి హోం వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఓ కారును ట్రాక్టర్ ఢీ కొట్టింది.. పోలాకి మండలం వెదుళ్ళ వలస నుంచి నరసన్నపేట వస్తున్న కారును పోలాకివైపు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టారు.. కారులో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.. వారిని ఆసుపత్రికి తరలించారు ట్రాక్టర్ డ్రైవర్ మద్యం తాగి నడపడం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.. పోలీసులకు సమాచారం అందించారు..