కామారెడ్డి జిల్లాలోని మాజీ సైనికుల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కామారెడ్డిలో స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికుల కామారెడ్డి సంఘం ప్రతినిధి భీమ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం బిక్కనూర్లో మాజీ సైనికుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలన్నారు. దేశం కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.