ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, మెరుగైన వైద్య సేవలకు అధునాతన పరికరాలు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.