ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ తెలిపారు. శుక్రవారం వాంకిడి మండలంలోని జైత్పూర్, బోర్డ ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రాజెక్టుల కొమురం భీం ప్రాజెక్టు ఎడుగేట్లు ఎత్తివేయడంతో వచ్చిన బ్యాక్ వాటర్ వలన పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు గొడిసెల కార్తీక్ ఉన్నారు.