దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గగుడి ప్రాంతంలోని ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పరిశీలించారు. సోమవారం సాయంత్రం సమయంలో క్యూ లైన్లు భక్తులు వచ్చే మార్గాలను పరిశీలించినట్లు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈవో కి సూచనలు జారీచేశారు.