శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుంటిపల్లి-జక్కసముద్రం గ్రామాల మధ్య పొలిమేరమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఆలయ సమీపంలో క్షుద్ర పూజలు చేయడమే కాకుండా సమీప భూముల్లో బండరాలను తవ్వినట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.