జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, శారదా మహిళా మండలి ఆధ్వర్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని సోమవారం రోజున శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభించారు. కరీంనగర్‌కు చెందిన బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మొదటగా భాగవత గ్రంథానికి పూజచేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు జక్కు రవీందర్, వేదపండితులు, సభ్యులు ప్రవచన కర్తను ఘనంగా సన్మానించారు. అనంతరం భాగవతంలో ఉన్న ప్రవచనాలను భక్తులకు వినిపించారు.