కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రెండు కంప్యూటర్లను కేటాయిస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం 12 గంటలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం లో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత బాషా తో కలిసి ఆయన పాల్గొన్నారు...కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపట్టానికి పూలమాల వేసి నివాళ్లులర్పించిన ఎంపీ, అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు...