శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న విజయ గణపతి ఆలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం 11 కెవి విద్యుత్ వైర్లు మార్చడంతో... ఆ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. విద్యుత్ మరమ్మత్తుల పనుల గూర్చి, విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే..