శాంతాపూర్ ప్రథమ చికిత్సాలయం సీజ్... కమారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్వాక్ ప్రథమ చికిత్సాలయాన్ని శనివారం సీజ్ చేసినట్లు మెడికల్ ఆఫీసర్లు డా.రోహిత్, డా.ఉమాకాంత్ రాత్రి 7 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య శాఖ సూచనలను పాటించకుండా ప్రజలకు నూతన వైద్యం పేరుతో ఇంజెక్షన్లను, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో ఫిర్యాదులు అందాయన్నారు. రెవెన్యూ అధికారుల సహాయంతో క్లినిక్ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.