ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీని గ్రామస్తుల సహాయంతో నిన్న గురువారం రోజున రాత్రి 10 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. రామచంద్రాపురం ఇసుక ర్యాంప్ నుంచి రాత్రి సమయంలో లోడింగ్ చేసుకొని తరలిస్తున్న లారీని గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. లారీతో పాటు, డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ తరలించారు. వే బిల్లు ఒక ర్యాంప్ అయితే ఆన్లైన్లో పెట్టని మరో ర్యాంప్ నుంచి అర్ధరాత్రి అక్రమంగా లోడింగ్ చేసుకొని వెళుతున్న క్రమంలో లారీని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు.