ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం నందు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతుల నుండి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించారు. అప్పటికప్పుడు రెవెన్యూ అధికారులకు సూచనలు చేసి వాటిని పరిష్కరించాలని సూచించారు. రైతులు న్యాయబద్ధమైన భూ సమస్యలు ఉంటే తక్షణమే రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.