మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని రేగోడు మండలం మర్పల్లి గ్రామంలో గురువారం ఈ హృదయ విరాధక ఘటన చోటుచేసుకుంది. మర్పల్లి గ్రామానికి చెందిన హరి గుండెపోటుతో బుధవారం మృతి చెందగా అంత్యక్రియలు ఇబ్బందికరంగా ముగిశాయి.అంత్యక్రియలకు వెళ్తున్న వారికి ఉదృతంగా పారుతున్న గొల్లవాగును దాటేందుకు ట్రాక్టర్ మరియు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బంధువులను దాటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.