శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలో ఆదివారం ఆకస్మికంగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది.. మందస, కుంటికోట, పిడి మందస, హరిపురం, హంస ర్యాలీ, రాజపురం, వంటి ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి.. ఈ వర్షం వరి పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు సూచించారు.. అయితే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినదని వాతావరణ శాఖ వెల్లడించింది..