సరూర్నగర్ లో గణేష్ మండపాలను కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మండప నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండప నిర్వాహకులు పలు సమస్యలు ఉన్నాయని తెలుపగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి శానిటేషన్ ఇంజనీరింగ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారికి సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.