Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Kalyandurg, Anantapur | Feb 7, 2025
బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. మండల పరిషత్ అధికారి నందకిషోర్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రీరాములు టెంకాయ కొట్టి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారి నందకిషోర్ మాట్లాడారు. క్వింటా కందులు రూ. 7,550 గా ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందన్నారు. బ్రహ్మసముద్రం మండలం తో పాటు చుట్టుపక్కల మండలాల రైతులు కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us