తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, తర్వాత అండగా ఉండాల్సిన తల్లి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్న పిల్లలు అనాధలుగా మారారు. తినడానికి తిండి లేక నానమ్మ సంరక్షణలో ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికులే వారికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ చిన్న పిల్లలకు సహాయ సహకారాలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లల్ని వదిలి వెళ్ళిపోయిన తల్లిని తీసుకువచ్చి కలపాలని, అలాగే పిల్లల అవతరాలు తీర్చేందుకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు. తమిళనాడుకు చెందిన మురుగేషన్ అనే వ్యక్తి ప్రస్తుతం పిల్లలకు నిత్యవసరాలను అందజేశారు.