బుధవారం వనపర్తి జిల్లా బుద్ధారం లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ రవి . ఇటీవలే విద్యార్థులకు ఎలుకలు పెరిగాయి అనే అంశంపై విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎలకలను చూసాము కానీ అవి కరిచాయా లేవా అన్న అనుమానం వ్యక్తం చేశారని సూచించారు. కావున విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సను అందించామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని చదువులపై రానించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు.