బాన్సువాడ మండలంలోని తాడ్కోలు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వ్యక్తి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై ఫోక్స్ కేసు నమోదు అయినట్లు ఎంఈఓ నాగేశ్వరరావు వెల్లడించారు. సదరు ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక అందజేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎంఈఓ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని ఎంఈఓ వెల్లడించారు.