కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆదివాసి జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ మాట్లాడుతూ... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మంత్రి సీతక్క ఖానాపూర్ ఎమ్మెల్యే బజ్జు పినపాక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యేలు ఎనలేని కృషి చేశారన్నారు. వారిపై కొంతమంది వ్యక్తులు తప్పుడు ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.