ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి ఒకేసారి వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు కమిటీ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో సిఐ శివలింగం, వివిధ శాఖల అధికారులు ఆయా మతాల ప్రతినిధులు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు.