మా గ్రామానికి జిల్లా కలెక్టర్ రావాలని కాగజ్ నగర్(M) నవేగాం,నాయకపుగూడ గ్రామాల ప్రజలు ASF కలెక్టరేట్ ఎదుట TAGS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. TAGS జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు మా గ్రామాలకు జిల్లా స్థాయి అధికారులు రాలేదన్నారు.దీంతో గ్రామస్తులంతా ఏకమై ASF కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.