కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. పోచయ్య అనే వృద్ధుడు గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో ఎన్నిసార్లు చూపించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కడుపునొప్పి ఇంకా తీవ్రం కావడంతో కడుపునొప్పి భరించలేక పోచయ్య గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యు లు గమనించి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.