నెల్లూరు జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాలలో వంద కోట్ల మేరకు అవినీతి జరిగిందని.. విజిలెన్స్ ఎంక్వయిరీ వేస్తె అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డీ అన్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం లో కూడా బిల్లులు మంజూరు అయ్యాయని అయన వెల్లడించారు.