నంద్యాల జిల్లా డోన్ లో జరిగిన బుధవారంమాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమార్ రెడ్డి వివాహ రిసెప్షన్ కు వెళ్లి తిరిగి వస్తూ వెల్దుర్తి హైవే వద్ద టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన ఆరు మందిని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదానికి గురైన వారు బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్ట