జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడ్డ ఓ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నిర్మల్ జిల్లా కుబీర్ మండల ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. కుబీర్ మండలం హల్దా గ్రామానికి చెందిన మల్లేష్ ఈనెల 26న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లో వెళ్లి చూడగా రూ.50 వేల విలువగల బంగారం పోయిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ కృష్ణారెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన విట్టల్ అనే యువకుడు మల్లేష్ ఇంట్లో దొంగతనం పాల్పడ్డట్లు నిర్ధారించారు. ఈ మేరకు