గండిపేట వద్ద మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే బిఆర్ఎస్ వల్లే కదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభించింది వైఎస్ఆర్ అని అన్నారు. ప్రాణహిత చేవెల్లకు నీళ్లు తీసుకురావాలని ఎవరు ప్రయత్నం చేశారో చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.