రైల్వే కోడూరు మండలం లోని పలు గ్రామాల్లోని బెల్ట్ షాపులపై విజయవాడ టాస్క్ ఫోర్సు అధికారులు శనివారం దాడులు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 46 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ తులసి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లి పంచాయతీకి చెందిన రమాదేవి, సెట్టిగుంట పంచాయతీకి చెందిన గౌరీ శంకర్ ను అరెస్టు చేసి వారి వద్ద నుండి 46 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.