నగర ప్రజల సమస్యలపై ఎన్ని అర్జీలు ఇచ్చినా.. ఎక్కడి సమస్యలు అక్కడే!ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి ఇచ్చిన ఆదేశాలపై కూడా స్పందన కరువైందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్, ఆర్ అండ్ బి, హైవే ఇంజనీర్లు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.ఆదివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి అశోక నగర్, వెంకటరమణ కాలనీ, ప్రేమనగర్ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రేమనగర్, మమతా నగర్ కూడలిలో 60 అడుగుల రోడ్డు మధ్యలో మోరీ (కల్వర్ట్) పై ఏర్పడిన గుంత చుట్టూ బండరాళ్లు పెట్టి ఎర్రబట్టతో ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ప్రైవేట్