జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థపు అవినీతి రాజకీయాల వల్లనే నిర్మాణం జాప్యం అవుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పోలవరం పై చర్చించేందుకు చంద్రబాబు గాని అధికారులు కానీ రావాలంటూ సవాల్ విసిరారు.