గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి పై 196/ఏ 351/2 సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లుగా మండల ఎస్సై తిరుమల రావు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పేర్కొన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రజల్లో అలజడి అశాంతి సృష్టించే వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం వైసీపీ సమావేశంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండల టిడిపి కన్వీనర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.