సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ విషయంపై ఎంఈఓ విద్యాసాగర్కు ఫిర్యాదు చేయగా, ఆయన పాఠశాల యజమాన్యానికి తరగతులను మూసివేయాలని ఆదేశించారు. సెలవు రోజు తరగతులు నిర్వహించినందుకు పాఠశాలకు నోటీసులు జారీ చేశారు