ఖాలీ బిందెలతో రోడ్డుపై ధర్నా గత 30 రోజుల నుంచి కాలనీకి నీళ్ళు రావడంలేదని కాటేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండలం కాటేపల్లి గ్రామంలోని బోయవాడ కాలనీవాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. గత 30 రోజుల నుంచి కాలనీకి నీళ్లు రాకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పనులు మానుకొని ఇతర కాలనీల నుండి నీళ్ళు తెచ్చుకుంటున్నామని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.