మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ డివిజన్లోని ప్రశాంత్ నగర్ లో భవన నిర్మాణ పని చేస్తున్న ఓర్సు శీను అనే వ్యక్తి కంప్రెసర్ ఆపరేటర్ గా పని చేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బంధువులు ఆసుపత్రి ముందర న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.