నల్లగొండ జిల్లా: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలలో హాస్టలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని నాణ్యతతో పౌష్టికాలంగా అందించాలని సూచించారు ఆదివారం నుంచి దసరా సెలవులు కావడంతో విద్యార్థులను ఇంటికి తీసుకు వెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో కాసేపు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు.