రోడ్డు ప్రమాదంలో జైనథ్ సీఐ కి గాయాలు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జైనథ్ సీఐ సాయినాథ్ కు గాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో జాతీయ రహదారిపై పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లగా బోరజ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై గురువారం ఓ వాహనం జైన సీఐ వానాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సీఐతో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి. వారిని రిమ్స్ కు తరలించారు. సీఐ వాహనం వెనుక భాగం నుజునుజ్జయింది. --------