కాకినాడ జిల్లా పిఠాపురం విద్యారంగలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆద్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు సిద్దు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు పిఠాపురం గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ముగుస్తుందని విద్యార్థుల సమస్యలు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారని ఆరోపించారు.